అసలు డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు, రిస్కులు, పన్నుల గురించి కూలంకుషంగా వివరించే గైడ్​.

April 18, 2022

అసలు డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి? అందులోని ప్రతీ అంశం

ఆన్​లైన్ వేదికల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసే సరికొత్త పద్ధతే డిజిటల్ గోల్డ్ (Digital Gold).

ప్రస్తుత కాలంలో బంగారాన్ని కొనాలని అనుకునేవారికి చాలా అనువైన, ఖర్చుపరంగా కూడా సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ మార్గం ఇది.

 

మీరు కొనుగోలు చేసే ప్రతీ గ్రాము బంగారం కూడా, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మూడు గోల్డ్​ బ్యాంకుల్లో ఏదైనా ఒకదానిలోని లాకర్​లో 24 క్యారట్ల బంగారంగా నిల్వ చేయబడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న గోల్డ్​ బ్యాంకులు – Augmont | MMTC - PAMP | SafeGold.

ఇప్పుడు ఇన్వెస్టర్లు యాప్​లోని బటన్​పై ఒక క్లిక్​ చేసి బంగారాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా బంగారం మీ ఇంటికే డెలివరీ అయ్యేలా ఆర్డర్​ కూడా చేయవచ్చు. మరో విషయమేంటంటే, డిజిటల్ గోల్డ్ (Digital Gold) ఎంత కొనుగోలు చేయాలనే పరిమితి కూడా ఏమీ లేదు. మీరు రూ. 1 విలువైన బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు.

 

ఈ ఆర్టికల్​లో, మేము అత్యంత విలువైన పసిడి లోహం యొక్క సరికొత్త రూపం గురించి ప్రతీ అంశాన్ని చర్చించాం.

డిజిటల్ గోల్డ్  పెట్టుబడులు ఎలా పని చేస్తాయి?

మీరు ఒక నగల దుకాణానికి వెళ్లి, ఒక నిర్ధిష్ట ధరకు ఆభరణాలను కొనుగోలు చేశారని అనుకోండి.

 

మీకు ఆ ఆభరణం యొక్క పరిమాణం, నాణ్యత గురించి ఎలాంటి అవగాహన ఉండదు. పైగా, తయారీ చార్జీల పేరిట మరింత అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

ఆ ఆభరణాన్ని ఇంటికి తీసుకొని వెళ్లి భద్రంగా మీ లాకర్​లో దాచి పెడతారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కదా?

అయితే, ఆ తర్వాత మీకు కింద పేర్కొన్న రెండు సందర్భాల్లో ఏదో ఒకటి ఎదురు కావచ్చు.

  • మీ ఇంట్లో దొంగతనం జరిగి, అప్పటివరకు మీరు దాచుకున్న బంగారం అంతా మీరు కోల్పోవచ్చు. లేదా,
  • ఆ ఆభరణం భద్రంగా ఉన్నప్పటికీ కూడా, ఓ పదేళ్ల తర్వాత దాన్ని వాడుదామని అనుకుంటే, దాని డిజైన్​ పాతది కావచ్చు, పాలిష్​ చేయాల్సి రావచ్చు. తద్వారా ఇప్పటికే మీరు పెట్టుబడి పెట్టిన దాని కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు.

ఇప్పుడు, ఇది ఆలోచించడండి.

మీరు అదే పరిమాణంలో బంగారాన్ని ఆన్​లైన్​లో కొనుగోలు చేశారు. అప్పుడు అది 24 క్యారట్ల బంగారంగా వాల్ట్​లలో భద్రపరచబడింది. 

ఇక్కడ మీరు తక్కువలో తక్కువ ఒక్క రూపాయిని కూడా పెట్టుబడి పెట్టవచ్చు. భవిష్యత్తు​లో దాన్ని మార్కెట్​ ధరకు అమ్ముకోవచ్చు. లేదంటే మీ ఇంటికి భౌతికమైన బంగారం రూపంలో డెలివరీ చేయించుకోవచ్చు.

ఇదంతా, కేవలం మీ స్మార్ట్​ ఫోన్​ను ఉపయోగించే చేయొచ్చు!

ఈ విధానం చాలా బాగుంది కదూ.. అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ విధానంలో మీరు మీ బంగారాన్ని భౌతికంగా కలిగి ఉండలేరు. మీ దగ్గర ఇంత బంగారం ఉందని పక్క వాళ్లకు చూపించలేరు.

చిన్న మొత్తాల్లో కొనుగోలు చేయగలగడం, సులభంగా డెలివరీ చేయించగల సౌలభ్యం, లిక్విడిటీ ఎంపికల వల్ల నవ యువకుల్లో, యువ భారతీయుల్లో డిజిటల్​ గోల్డ్​ (Digital gold) అంటే పాపులారిటీ పెరుగుతోంది.

మీరు ఏదైనా యాప్​ నుంచి డిజిటల్​ గోల్డ్ (digital gold) ​ను కొనుగోలు చేస్తున్నట్లు అయితే, నిజానికి మీరు మధ్యవర్తుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్లు. వారు పేరుగాంచిన కంపెనీలైన Augmont Gold Ltd, Digital Gold India Pvt. Ltd. – SafeGold మరియు MMTC-PAMP India Pvt. Ltd వంటి కంపెనీల నుంచి మీరు ఆ బంగారాన్ని యాక్సెస్​ చేసుకునేలా సాయం చేస్తారు.

మీ డిజిటల్​ గోల్డ్​ (digital gold) భద్రంగా ఉండేలా చూసుకున్నందుకు గాను ఈ మధ్యవర్తులు మీ దగ్గర కొంత మొత్తాన్ని వసూలు చేస్తారు.

మరి ఒకవేళ మీరు మీ స్మార్ట్​ ఫోన్ కోల్పోతే మీ బంగారం కూడా పోయినట్లేనా?

అలా ఏం జరగదు. షేర్ మార్కెట్​ స్టాకుల మాదిరిగానే, మీ డిజిటల్​ గోల్డ్​ (digital gold) కూడా మీ పేరు మీద నమోదు అయి ఉంటుంది.

అంతేగాక, స్వతంత్ర ధర్మకర్తల ద్వారా బీమా చేయబడిన, ధ్రువీకరించబడిని వాల్టులలో భద్రంగా నిల్వ చేయబడుతుంది.

 

తద్వారా, మీరు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఉపయోగించిన యాప్​ లేకుండా పోయినప్పటికీ కూడా మీ బంగారం చాలా భద్రం​గా ఉంటుంది.

డిజిటల్ గోల్డ్​ ను ఎక్కడ కొనుగోలు చేయాలి?

ఎవరైనా సరే, డిజిటల్​ గోల్డ్​ (digital gold)ను రిజిస్టర్డ్​ యాప్స్​, మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Jar App ద్వారా కూడా మీరు డిజిటల్​ గోల్డ్ (digital gold)​ను కొనుగోలు చేయవచ్చు. దీనిలో మీరు కేవలం ₹1 పెట్టుబడితో కూడా కొనొచ్చు.

NPCI, మార్కెట్​లోని అత్యుత్తమ UPI ప్రొవైడర్ల మద్దతు ఉన్న Jar app, మీ సేవింగ్స్​ను ఆటోమేటిక్​గా బంగారంలో​ పెట్టుబడి పెడుతుంది. తద్వారా మీకు రోజువారీ పొదుపు పద్ధతిని అలవాటు చేస్తుంది. Jar App​ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

మీరు ఉపయోగిస్తున్న వేదికను బట్టి మీరు KYC లేకుండా నిర్దిష్ట పరిమితి వరకే డిజిటల్ గోల్డ్ (Digital gold)​ను కొనుగోలు చేయొచ్చు.

కొన్ని ప్రముఖ యాప్స్​లో ఎటువంటి KYC అవసరం లేకుండా రూ. 50,000 విలువ గల బంగారాన్ని కూడా కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.

Jar App విషయానికి వస్తే ఎటువంటి KYC అవసరం లేకుండా మీరు 30 గ్రాముల వరకు డిజిటల్​ గోల్డ్​ (digital gold)ను కొనుగోలు చేయొచ్చు.

డిజిటల్​ గోల్డ్​  లో పెట్టుబడులు పెట్టడం వలన ప్రయోజనాలు.

  • డిజిటల్​ గోల్డ్​ (Digital gold) ను ట్రాక్​ చేయడం చాలా సులభం. దీనిని రోజులో ఏ సమయంలోనైనా యాక్సెస్​ చేసేందుకు వీలుంటుంది.
  • ఇది అధిక లిక్విడిటీని అందిస్తుంది. రోజులోని ఏ సమయంలోనైనా మార్కెట్​ రేట్ల ప్రకారం బంగారాన్ని అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయొచ్చు.
  • దేశవ్యాప్తంగా లాక్​డౌన్ వలన ఆభరణాల దుకాణాలను మూసివేశారు. ఆ సమయంలో డిజిటల్​ గోల్డ్​ (digital gold) ట్రేడర్ అయిన Augmont Gold Ltd యొక్క వ్యాపారం​ 40-50 శాతం పెరిగింది. ఈ గణాంకాలను బట్టి ఎక్కువ మంది ప్రస్తుత రోజుల్లో డిజిటల్​ గోల్డ్​ (digital gold)ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అర్థం అవుతోంది.
  • ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు బంగారం మంచి పెట్టుబడి లాంటిది. అంతేగాక, దీన్ని రుణాలకు పూచీకత్తుగా కూడా పెట్టుకోవచ్చు.
  • గత 92 ఏళ్లుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో బంగారానికి సాంస్కృతికపరమైన ప్రాముఖ్యతే కాకుండా మంచి ఇంట్రిన్సిక్​ విలువ కూడా కలిగి ఉంటుంది. ఏటికేడాది మంచి రిటర్నులు ఇవ్వడానికి ఇదొక గొప్ప పెట్టుబడి వంటిది.

డిజిటల్​ గోల్డ్​  లో పెట్టుబడి పెట్టడం వలన ప్రతికూలతలు

  • ఇది మీకు ప్యాసివ్​ ఆదాయాన్ని జనరేట్​ చేయదు. అంటే, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం మీద ఎటువంటి వడ్డీ మీకు రాదు.
  • డిజిటల్​ గోల్డ్​ (digital gold) అనేది SBI మరియు SEBI నిబంధనలకు లోబడి  ఉండదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
  • చాలా ప్లాట్​ఫామ్​లలో గరిష్టంగా రూ. 2 లక్షల వరకే డిజిటల్​ గోల్డ్​ ((digital gold)) మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా కొంతమంది పెట్టుబడిదారులకు నచ్చదు.
  • మీ డిజిటల్​ గోల్డ్​ (digital gold)ను డెలివరీ చేసేందుకు కంపెనీలు కొంత మేనేజ్​మెంట్​ ఫీజును వసూలు చేస్తాయి.

ఈజీ లిక్విడిటీ, భద్రత, డెలివరీ ఎంపికలను బట్టి చూస్తే డిజిటల్​ గోల్డ్ (digital gold)​లో పెట్టుబడి పెట్టడం బాగానే అనిపిస్తుంది. దానికి ఉన్న ప్రతికూలతలు కూడా అంతగా పెద్దవి అనిపించవు.

మీరు ఆన్​లైన్​లో షాపింగ్​ చేసినంత సులభంగా డిజిటల్​ గోల్డ్ (digital gold)​లో పెట్టుబడి పెట్టవచ్చు. డిజిటల్​ గోల్డ్​ (digital gold)లో పెట్టుబడి పెట్టేందుకు కింద పేర్కొన్న సులభమైన స్టెప్పుల​ను అనుసరించండి.

 

  • బంగారం పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పించే Jar, అమెజాన్, HDFC సెక్యూరిటీస్, Paytm వంటి ఏదైనా ప్లాట్​ఫామ్​కు వెళ్లండి.
  • ‘Gold locker/vault’ ఆప్షన్​ను ఎంచుకోండి.
  • మీరు డిజిటల్​ గోల్డ్​ (digital gold) ఎంత మొత్తంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ విలువను నమోదు చేయండి. డిజిటల్​ గోల్డ్​ (digital gold) ధర పూర్తిగా మార్కెట్​ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎవరి ప్రమేయం ఉండదు. కావున మీరు డిజిటల్​ గోల్డ్ (digital gold) ​ను మధ్యవర్తి సూచించిన నిర్దిష్ట మార్కెట్​ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిజిటల్​ గోల్డ్ (digital gold) ​ను వెయిట్​ ప్రకారం లేదా ధర ప్రకారం కొనుగోలు చేసే వీలుంటుంది.
  • మీ డెబిట్​ కార్డు, క్రెడిట్​ కార్డు, నెట్​ బ్యాంకింగ్​ లేదా వాలెట్​ నుంచైనా పేమెంట్​ పూర్తి చేయండి.
  • మీరు చెల్లించిన మొత్తానికి సమానమైన డిజిటల్​ గోల్డ్​ (digital gold) ​మీకు అందుతుంది. అది 100 శాతం భద్రంగా నిల్వ చేయబడుతుంది.
  • డిజిటల్​ గోల్డ్​ (digital gold) ​ను తక్షణమే కొనుగోలు చేయొచ్చు లేదా అమ్మేయచ్చు. పెట్టుబడిదారులకు ఎలా నచ్చితే అలా డిజిటల్​ గోల్డ్​ (digital gold) ​ను బులియన్స్ లేదా నాణేల​ రూపంలో డెలివరీ పొందవచ్చు. డిజిటల్​ గోల్డ్ (digital gold) ​​ను డెలివరీ చేసేందుకు చాలా సంస్థలు కొంత మొత్తాన్ని డెలివరీ ఫీజు కింద వసూలు చేస్తాయి. ఈ ఫీజు ఎంత ఉండాలనేది ఆ ​సంస్థలే నిర్ణయిస్తాయి.

డిజిటల్ గోల్డ్, భౌతిక బంగారం మీద పన్నులు:

భౌతికంగా ఉన్న బంగారాన్ని అమ్మడం ద్వారా వచ్చిన లాభాలపై అది ఎన్ని రోజుల్లో అమ్మడం ద్వారా వచ్చిందనేదాన్ని బట్టి షార్ట్​ టర్మ్​ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్​ గెయిన్స్​పై పన్నులు విధిస్తారు.

మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (అది ఆభరణాలైనా, డిజిటల్ గోల్డ్ (digital gold) ​అయినా, లేదా నాణేలు అయినా కావొచ్చు) మీరు కొనుగోలు చేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాల్లోపు అమ్మితే ఆ అమ్మకాలను Short-Term Capital Gains(STCG) గా పరిగణిస్తారు.

భౌతిక బంగారం,​ డిజిటల్ గోల్డ్​ (digital gold) ​పెట్టుబడులకు పన్నుల విధానం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

డిజిటల్ గోల్డ్  ఎవరు కొనుగోలు చేయాలి?

భౌతిక రూపంలో బంగారాన్ని కొనలేని వారు, బంగారం మీద ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారికి డిజిటల్​ గోల్డ్​ (digital gold) చాలా ఉపయోగపడుతుంది.

డిజిటల్ గోల్డ్ (digital gold) అనేది 99.9% 24 క్యారట్ల నాణ్యతతో లభిస్తుంది. Jar App ను ఉపయోగించి తక్కువలో తక్కువ ₹1 విలువైన బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేగాక, ఈ బంగారాన్ని ఎక్కడ దాచాలా అని బాధపడాల్సిన అవసరం ఉండదు.

దీనికి మీకు కావాల్సిందల్లా ఒక్కటే.. మీ స్మార్ట్​ ఫోన్​లో Jar App. Jar యాప్​లో మీరు మీ డబ్బును ఆటోమేటిగ్గా పెట్టుబడి పెట్టవచ్చు. Jar యాప్​ గురించి తరచూ అడిగి ప్రశ్నల గురించి మరింత తెలుసుకోండి.

డిజిటల్ గోల్డ్ (digital gold) కొనుగోలు అవకాశం కల్పించే ఇతర ప్లాట్​ఫామ్స్ నుంచి కూడా డిజిటల్ గోల్డ్ (digital gold) ​ను కొనుగోలు చేయవచ్చు.

డిజిటల్ గోల్డ్ (digital gold) ను తక్షణమే మార్కెట్​ రేట్లకు కొనవచ్చు లేదా అమ్మేయవచ్చు. డిస్కౌంట్లు, మేకింగ్​ చార్జీల గురించి ఆభరణాల దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

SEBI మరియు RBI ద్వారా రెగ్యులేట్​ చేయబడుతున్న Gold Bonds మరియు Gold ETF ల వంటి డిజిటల్ గోల్డ్ (digital gold) రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చు.

దీనిలో ఉండే ఫ్లెక్లిబిలిటీ కారణంగా తక్కువ సమయం పాటు పెట్టుబడి పెట్టాలని చూసే వారు SGBలలో పెట్టుబడి పెట్టేకంటే డిజిటల్ గోల్డ్ (digital gold) లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

డిజిటల్ గోల్డ్ (digital gold) ను SGBలా కాకుండా మీరు కొనుగోలు చేసిన ప్లాట్​ఫామ్​లో తక్షణమే కొనుగోలు చేయొచ్చు, అమ్మేయవచ్చు.

SGBలు 8 సంవత్సరాల కాలపరిమితితో ఉంటాయి. జారీ చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాల తర్వాత మాత్రమే మీరు వీటిని సొమ్ము చేసుకునేందుకు వీలుంటుంది.

అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ లేదా ETFల విషయానికి వస్తే పలు కంపెనీలకు మీరు అధిక చార్జీలను చెల్లించాల్సి వస్తుంది.

చివరగా, తక్కువ మొత్తంలో పెట్టుబడులతో ప్రారంభించాలని అనుకునేవారికి డిజిటల్ గోల్డ్ (digital gold) అనేది మంచి ఎంపిక అవుతుంది. ఇది చాలా భద్రం​గా ఉంటుంది కూడా.

డిజిటల్ గోల్డ్ (digital gold) లో గొప్ప విషయం ఏంటంటే.. దానితో పాటు వచ్చే ఫ్లెక్సిబిలిటీ.

ఒక రోజులో ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయగలగడం, అమ్ముకోగలగడంతో పాటు డెలివరీ విషయంలో ఉండే సౌలభ్యం కారణంగా, భవిష్యత్తు కోసం బంగారాన్ని దాచుకోవాలని అనుకునేవారికి డిజిటల్ గోల్డ్ (digital gold) గొప్ప ఎంపిక అవుతుంది.

డిజిటల్ గోల్డ్ (digital gold) ను కొనేందుకు ఎన్నో సులభమైన మార్గాలున్నాయి. అందులో ఒకటి Jar App. ఇది బంగారంపై మీరు సులభంగా పెట్టుబడి పెట్టేందుకు మీకు అవకాశమిస్తుంది.

ప్రతీరోజు మీరు చేసే లావాదేవీల్లో పొదుపు చేసి మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో Jar యాప్​ మీకు సహాయపడుతుంది.

మీ దగ్గర మిగిలిన చిల్లరను Jar app ఆటోమేటిక్​గా డిజిటల్ గోల్డ్ (digital gold) రూపంలో పెట్టుబడి పెడుతుంది. తద్వారా భవిష్యత్తులో మీకు ఉపయోగపడేలా డిజిటల్ గోల్డ్ (digital gold) ను సమీకరిస్తుంది.

Digital Gold InfoGraph
Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.