ప్రస్తుతం చాలా మంది పూర్తిస్థాయి ఫ్రీలాన్సింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు, సరికొత్త జీవనశైలికి వారు మారుతున్న నేపథ్యంలో ఆర్థికంగా స్వతంత్రులు ఎలా కావచ్చో చదవండి.
మీ పదవీ విరమణ కోసం ప్రతీ నెలా మీ ఆదాయంలో 10-15 శాతం పొదుపు చేసుకోవడం, మీకు మీరే ప్రాధాన్యత ఇచ్చుకోవడం, పన్నులను ప్రణాళిక ప్రకారం చెల్లించడం వంటి అనేక రకాల ఆర్థిక సలహాలను మీరు వినే ఉంటారు.
కానీ, మీరు హెచ్చుతగ్గుల ఆదాయం వచ్చే ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తోంటే, ఆ సలహాలేవీ మీకు అంత సంబంధం ఉన్నట్లు అనిపించవు, కదా? వీటిలో చాలా వరకు మీకు వర్తించవు కూడా.
ఇలా, మీకు రెగ్యులర్ ఆదాయం లేకపోతే, దానిలో 10 శాతం తీసి పదవీ విరమణ కోసం పక్కన పెట్టుకోవడం కొన్నిసార్లు కష్టం అవుతుంది.
మీ రుణ భారంలో పెద్ద మొత్తాన్ని మీరు చెల్లించలేరు. పైగా చెల్లింపు ఆలస్యమైన కొద్దీ డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో మీకు తెలియదు.
మనమందరమూ ఆర్థిక స్వేచ్ఛ సాధించాలని కోరుకుంటాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తున్నప్పుడే దీన్ని సాధించడం కష్టంగా మారుతోంటే, మీరు ఫ్రీలాన్సర్ అయితే అది మరింత కష్టం అవుతుంది కదా.
అందుకే డబ్బుల రాకలో అనిశ్చితి ఉంటే మీ ఆర్థిక వ్యవహారాలపై మీరు దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంటుంది.
ఒక ఫ్రీలాన్సర్‌గా ఉన్న ఇబ్బంది ఏంటంటే కార్పొరేషన్లలో జరిగినట్టు కాకుండా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుపై మరింత నియంత్రణ కలిగి ఉండాల్సి ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుందో నిర్ణయించుకోవాల్సి వస్తుంది.
రీసెర్చ్‌గేట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రీలాన్సర్లలో 33% మంది భారతదేశంలోనే నివసిస్తున్నారు (అంటే ప్రతి మూడో ఫ్రీలాన్సర్), అంటే దాదాపు 1.5 కోట్ల మంది అన్న మాట.
వాస్తవానికి ఈ సంఖ్య 2035 నాటికి ప్రతీ 5 సంవత్సరాలకు రెట్టింపు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు, చాలా మంది వ్యక్తులు ఫుల్ టైమ్ ఫ్రీలాన్సింగ్, FIRE (ఆర్థిక స్వతంత్రత స్వచ్ఛంద పదవీ విరమణ) జీవన విధానానికి మారడంతో మీ ఆర్థిక వ్యవహారాలను ఎలా చూసుకోగలరు? మీ ఆర్థిక లక్ష్యాలను ఎలా సాధించగలరు? ఆర్థికంగా స్వతంత్రంగా ఎలా మారగలరు?
మీకు అవసరమైన అన్ని ఫైనాన్షియల్ టిప్స్ను జార్ మీకు అందిస్తోంది:
1. మీ రేట్లను సరిగ్గా సెట్ చేసుకోవడం
ఫ్రీలాన్సర్లు తరచూ తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. ప్రారంభంలో చాలా తక్కువ వసూలు చేస్తుంటారు. వారు ఓ ఉద్యోగి మైండ్‌సెట్‌లో చిక్కుకుపోయి, వారి ముందటి యజమాని అందించిన అన్ని ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవడమే ఇందుకు కారణం.
మీకు మీరే సొంత బాస్‌లాగా భావించి ఎక్కువ రుసుము తీసుకోవాలి.
మీ కనీస వ్యయాన్ని లెక్కించండి. పొదుపులు, హెల్త్ ఇన్సూరెన్స్, అత్యవసర, పదవీ విరమణ నిధులు, పన్నులు అలాగే మీ రేట్లను సెట్ చేయడానికి ముందు మీరు ఏ పనీ చేయలేని కాలం, క్లయింట్‌ల నుంచి పొందని కాలం వంటి ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
మీరు పనిని ఎప్పటికీ ఆపివేయకూడదని అనుకున్నప్పటికీ మీరు ఇకపై ఆదాయాన్ని పొందని రోజు కోసం లేదా 35 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేయాలని మీరు భావించినా కూడా ముందుగానే సిద్ధం చేసుకోెవాలి.
ఒక నెలలో మీరు కనీసం ఎంత డబ్బు సంపాదించాలో కూడా మీరు నేర్చుకుంటారు.
2. అనవసర ఖర్చులను తగ్గించుకోండి
మీరు కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరమైన వస్తువులపై ఖర్చు చేస్తుంటారు. మీ వ్యక్తిగత, కార్పొరేట్ ఖర్చులను చెక్ చేసుకోవడం, వాటిని తొలగించడం వంటి తెలివైన నిర్ణయాలు తీసుకోండి.
డబ్బును ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్లకు లేదా పొదుపు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరో బ్యాంక్ ఖాతాకు ఎందుకు మార్చకూడదు? జార్ యాప్ మాదిరిగా.
అలాగే అది సృష్టించే విలువ కంటే ఖరీదైన దాని కోసం ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకోకండి. పొదుపును అలవాటు చేసుకోండి.
స్వయం సమృద్ధి సాధించడం కోసం మీ ఆర్థిక లక్ష్యాల వైపు, ఎక్కువ డబ్బు సంపాదించడం, కొత్త ఆదాయాన్ని మళ్లించడంపై దృష్టి పెట్టండి.
3. బడ్జెటింగ్ ప్రారంభించండి
మీరు 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగి అయినా, ఫ్రీలాన్సర్ అయినా ప్రతి ఒక్కరికీ బడ్జెటింగ్ తప్పనిసరి. మీ తిరిగి వచ్చే ఖర్చులను జాబితా చేసుకోండి. వాటిని ప్రాధాన్య క్రమంలో ఉంచండి.
మీరు మీ నెలవారీ ఖర్చులు తెలుసుకున్న తర్వాత, బడ్జెట్‌ను ఏర్పాటు చేసుకోండి. మీ అన్ని ఖర్చులు, పొదుపులను తరచూ చూసుకుంటూ ఉండండి.
ఇక్కడ ట్రిక్కు సున్నా వద్ద ప్రారంభమవుతుంది. మీరు ఇటీవల నెలలలో సగటున ఎంత ఖర్చు చేశారో మాత్రమే చూసుకోకండి.
ఆ తర్వాత అద్దె, ఆహారం, నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలతో ప్రారంభించి ఖర్చులన్నీ పద్ధతి ప్రకారం ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వెళ్లండి.
మీకు ఈ నెల డబ్బులు వచ్చిందున మీ జాబితాలోని చాలా ముఖ్యమైన వస్తువులపై మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి.
అవసరమైన అన్ని ఖర్చులను చూసుకోవడం, మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టడం అనేది ఇక్కడ పాయింట్.
4. అత్యవసర నిధుల కోసం ప్రత్యేక ఖాతా రూపొందించండి
ఫ్రీలాన్సర్‌గా, మీ ఆదాయం హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. అయితే మీ ఖర్చులు స్థిరంగా లేవని దీని అర్థం కాదు.
అందుకే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఒత్తిడి ఏమీకాదు. మీ అత్యవసర నిధిలో కనీసం ఆరు నెలల వరకు మీకు సరిపడేంత డబ్బు అవసరం.
ప్రమాదాలు, ఆలస్యమైన చెల్లింపులు లేదా కారు బ్రేక్‌డౌన్‌లు ఇలా అత్యవసర నిధి ఎప్పుడు అవసరం అవుతుందో మీకే తెలియదు. ఊహించని వాటి కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందే.
స్వతంత్ర లేదా స్వయం ఉపాధి జీవితం గడపడానికి మీ ఫుల్ టైమ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి ముందే మీరు కొంత నగదును మీ చేతిలో కలిగి ఉండాలి.
అత్యవసర నిధి కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ఖాతాలో అవసరాలు, పన్నుల చెల్లింపు తర్వాత మిగిలిన నిధులను నిల్వ చేయండి.
మీరు పనిచేయలేని నెలలో కూడా మీ జీవితం సాఫీగా సాగేలా ఇది చూస్తుంది. మీ అసలు ఆదాయం, కనీస అవసరాల మధ్య తేడాను మీ ప్రధాన ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.
నగదు అధికంగా ఉండే నెలల్లో బ్యాలెన్స్ ఉంచుకోండి. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీరు మీ నగదు ఇన్‌వాయిస్‌లపై పూర్తిగా ఆధారపడకుండా ఉంటుంది.
5. మీ పొదుపును మంత్లీ బిల్లుగా భావించండి
మీ పొదుపు మొత్తాన్ని నెలవారీ బిల్లుగా భావించండి. మీరు మీ ప్రాథమిక ఆదాయాన్ని స్థిరంగా ఉంచుకోగలిగితే, మీకు మీరు చెల్లించుకోవడం ప్రారంభించుకోవాలి.
దీన్ని సాధారణ ఖర్చుగా పరిగణించండి. అప్పుడు అవి మీకు బరువు అనిపించవు, జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి.
ఇలా, మీరు కొద్దికొద్దిగా ప్రారంభించి, ఆపై డబ్బు పెరుగుతుండటం చూడొచ్చు. ఇది చాలా బాగా అనిపిస్తుంది కదా!
6. మీ ఆర్థిక లక్ష్యాలను క్రమం తప్పకుండా సమీక్షించుకుని.. మెరుగుపరుచుకోండి.
మనందరికీ పదవీ విరమణ కోసం పొదుపు మాత్రమే కాకుండా వేరే ఆర్థిక లక్ష్యాలు కూడా ఉంటాయి. మీరు అత్యవసర, పదవీ విరమణ నిధి కలిగి ఉన్న తర్వాత ఇల్లు లేదా కారు కొనడం, ప్రయాణాలు, విద్య, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు మొదలైన ఇతర ఖర్చులను తీర్చుకోవచ్చు.
ఈ స్వల్ప, మధ్య కాలిక లక్ష్యాలను మీ రిటైర్మెంట్ పొదుపుతో లేదా ముందుగానే పూర్తి చేసుకోవాలి.
వాటిని ఎప్పటికప్పుడు పునఃపరిశీలించండి. కానీ భారీ లేదా చిన్నపాటిదైనా సరే ఎల్లప్పుడూ కొన్ని లక్ష్యాలను కలిగి ఉండటం మంచిది.
వాటిని సాధించడంపై మీ దృష్టిని సారించి దాని చుట్టూ మీ జీవనశైలిని ప్లాన్ చేసుకోండి. వీలైనంత త్వరగా ఆర్థికంగా స్వతంత్రంగా నిలదొక్కుకోవడానికి ఇదే సరైన మార్గం.
7. ఇన్సూరెన్స్ చేయించుకోండి
మీరు ఫుల్ టైం కంపెనీలో పని చేయట్లేదు కాబట్టి మీ గురించి మీరు చాలా జాగ్రత్త వహించాలి. మంచి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ రెండింటినీ తీసుకోవాలి.
ఈ రెండు పాలసీలకు ప్రీమియం అంత ఖర్చు అయ్యేదేమీ కాదు. మీరు ఇన్సూరెన్స్‌ను చిన్న వయస్సులోనే తీసుకున్నట్లయితే దాని అవసరం వచ్చినప్పుడు వెంటనే ఉపయోగించుకోవచ్చు.
దేశంలోని హెల్త్ కేర్ పరిస్థితిని బట్టి చూస్తే ఇది లేకుండా మీరేమీ చేయలేరు.
మీ వ్యక్తిగత అవసరాలకు బాగా సరిపోయే పాలసీని శోధించి ఎంచుకోండి. ప్రస్తుతం ఇన్సూరెన్స్ పాలసీలు మరణాన్నే కాదు.. అంగ వైకల్యం, వ్యాధులను కూడా కవర్ చేస్తున్నాయి. కాబట్టి నిర్ణయించుకునే ముందు అన్నీచూసుకోండి.
8. బంగారంలో పెట్టుబడి పెట్టండి
ఫ్రీలాన్సింగ్ చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా మీ డబ్బు విలువ తగ్గుతుంది. దీనికి ద్రవ్యోల్బణం కారణం కావచ్చు.
కాబట్టి మీ ఆదాయాన్ని స్థిరంగా ఉంచడం ద్వారా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా అంటారా? అందుకే బంగారంలో పెట్టుబడి పెట్టాలి. మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా ఉంచుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఇదొక అద్భుతమైన పరిష్కారం.
వెండి, ప్లాటినం వంటి వేరే ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి బంగారం గురించి మాత్రమే తెలుసుకుందాం. ఎందుకంటే దీన్ని కొనుగోలు చేయడం చాలా సులభం. పైగా నమ్మదగిన ఆస్తి కూడా. మీరు దాన్ని భౌతిక రూపంలో ఉంచాల్సిన అవసరం కూడా లేదు. మీరు దీన్ని డిజిటల్ గోల్డ్ లేదా SGBలుగా కూడా కొనుగోలు చేయవచ్చు.
ఇతర సాధారణ పెట్టుబడి మార్గాలతో పోలిస్తే బంగారం అనిశ్చిత మార్కెట్‌లలో కూడా స్థిరంగా ఉంటుంది.
ఏదేమైనప్పటికీ, మీ రిస్కు శైలిని మీరు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. అంటే స్టాక్‌లు, బాండ్లలో పెట్టుబడి పెట్టడం లాంటివి. ఆ తర్వాత బంగారంలో పెట్టుబడి పెట్టండి. మీ డబ్బును సమర్ధవంతంగా వృద్ధి చేసుకోండి. జార్ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి.
ఫ్రీలాన్స్ లేదా ఫుల్ టైం పనిచేసే వారు ఎవరైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అయితే అధిగమించలేనివంటూ ఏవీ ఉండవు. మీరు కోరుకున్న జీవన విధానాన్ని జీవించేందుకు, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి ఈ చిట్కాలతో మీ ఆర్థిక పరిస్థితి ఎలాంటి అడ్డంకి కాబోదు.