డిజిటల్ గోల్డ్ & ఫిజికల్ గోల్డ్ (భౌతిక బంగారం) మధ్య తేడా ఏమిటి? డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం తగినదేనా? డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి మీరు తెలుసుకోవాలనుకునే అన్ని విషయాలు.
మన భారతీయులు అందరికీ బంగారం అంటే మహా ప్రీతి, కదా? అది బంగారు ఆభరణాలు కావచ్చు, బంగారు నాణెలు కావచ్చు లేదంటే బంగారం బిస్కెట్లు కావచ్చు. మనం బంగారాన్ని అనేక రూపాల్లో వాడుతుంటాం.
దానిని సంపదకు చిహ్నంగా, శ్రేయస్సుకు భరోసాగా భావించడమే గాక కష్ట సమయాల్లో మనకు సాయపడే పెట్టుబడిలా కూడా చూస్తాం.
అధిక రిస్క్ ఉండే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ తో పోలిస్తే విలువైన ఈ లోహంలో పెట్టుబడి పెట్టడం రిస్క్ ను తగ్గిస్తుంది.
ఇప్పుడు ప్రపంచం డిజిటల్ వైపు మరలుతోంది, డిజిటల్ గోల్డ్ అంతకంతకూ పాపులర్ అవుతోంది.
అయితే ఈ జనాదరణ వెనుక కారణం ఏమిటి, ఇది మన ఇళ్లలో ఉండే భౌతిక బంగారంతో పోలిస్తే భిన్నంగా ఎలా ఉంటుంది? వీటన్నింటినీ వివరించడానికి జార్ (Jar) మీ కోసం ఒక గైడ్‌ని తీసుకొచ్చింది:
డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి?
డిజిటల్ గోల్డ్ అనేది భౌతిక బంగారానికి ఒక ప్రత్యామ్నాయం. మారకపు రేటు అవకతకలు, మార్పుల నుండి ఇది మినహాయింపు కలిగి ఉంటుంది. అంతేగాక భౌతికంగా ముట్టుకోకుండానే ప్రపంచమంతటా దీనిని సులభంగా ట్రేడ్ చేయవచ్చు.
భారతదేశంలో, మీరు డిజిటల్ గోల్డ్ ని పలు రకాల యాప్స్, వెబ్ సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే, కేవలం 3 బంగారు కంపెనీలు మాత్రమే మీ బంగారాన్ని నిల్వ చేస్తాయి. అవి ఆగ్‌మాంట్ గోల్డ్ లిమిటెడ్, డిజిటల్ గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. - సేఫ్‌గోల్డ్, మరియు MMTC-PAMP ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎలాంటి నిల్వ, రవాణా సహా అదనపు ఖర్చులు అవసరం లేకుండా బంగారాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన, అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం. జార్ (Jar)తో డిజిటల్ గోల్డ్ లో మీరు ఎలా పెట్టుబడి పెట్టవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
డిజిటల్ గోల్డ్ Vs. సంప్రదాయ బంగారం
1. పెట్టుబడి పరిమాణం: భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనుగోలు చేయాలి. దీని ధర ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. అయితే, డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టడం చాలా సరసమైనది. దీనిలో మీరు కేవలం ₹10 నుంచే కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. ఇది సరసమైనదే కాక మీరు పరిమిత ఆదాయంతో కూడా డిజిటల్ గోల్డ్ లో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.
2. స్టోరేజ్: సాధారణంగా మన భారతీయుల ఇళ్లలో పెద్దలు బంగారాన్ని లాకర్లలో ఉంచడం మనం తరచూ చూస్తాము. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది దొంగిలించబడుతుందనే భయం ఎల్లప్పుడూ ఉంటుంది. దీన్ని నివారించడానికి, కొంతమంది సుదీర్ఘకాలం పాటు బ్యాంక్ లాకర్‌లో కూడా ఉంచుతారు. ఆపై రిజిస్ట్రేషన్ ఫీజులు, వార్షిక ఫీజు, సర్వీస్ ఫీజు మొదలైన వాటి రూపంలో స్టోరేజ్ ఖర్చులు ఉంటాయి.
డిజిటల్ గోల్డ్ దీర్ఘకాలిక ఖర్చులు, స్టోరేజ్ సమస్యలను నివారించడానికి మీకు అనుమతిస్తుంది. ఉచితంగా రక్షణ పొందవచ్చు లేదా ఫేస్ వ్యాల్యూతో బీమా చేయబడి ఉంటుంది.
3. అధిక లిక్విడిటీ: ఇతర అసెట్ క్లాసులతో పోలిస్తే, బంగారం అత్యధిక లిక్విడిటీని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, భౌతిక బంగారం ఇప్పటికీ కొన్ని రకాల లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటుంది. అవి: భౌతిక బంగారాన్ని లిక్విడేట్ చేయడానికి, దాని పూర్తి పునఃవిక్రయం విలువను పొందడానికి, మీరు దానిని కొనుగోలు చేసిన డీలర్‌కు విక్రయించడం తప్పనిసరి. మొత్తం పునఃవిక్రయం విలువ పొందడానికి ఒరిజినల్ కొనుగోలు బిల్లు కూడా అవసరం.
డిజిటల్ బంగారాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. భవిష్యత్తులో బంగారం యొక్క పూర్తి పునఃవిక్రయం విలువను పొందడానికి మీరు డీలర్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు లేదా చాలా సంవత్సరాల పాటు సురక్షితమైన బంగారం కొనుగోలు అకౌంట్ ను ఉంచాల్సిన అవసరం లేదు.
4.ట్రేడింగ్: ఫిజికల్ గోల్డ్ ట్రేడింగ్ కంటే డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. భౌతిక బంగారాన్ని కొనడానికి లేదా విక్రయించడానికి, మీరు ఒక రోజు కేటాయించాలి, నగల దుకాణం లేదా బ్యాంకుకు వెళ్లాలి. ఇది సమయం తీసుకుంటుంది. అసౌకర్యంగా ఉంటుంది. అంతేగాక బంగారం కొనాలంటే చేతిలో గోల్డ్ లాకర్ ఉండాలి.
మరోవైపు, డిజిటల్ గోల్డ్ ని ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా, కొన్ని సులభమైన స్టెప్పుల్లో కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. విజయవంతంగా విక్రయించిన తర్వాత, డబ్బు నేరుగా మీ రిజిస్టర్డ్ వ్యాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు కొద్ది రోజుల్లోనే బదిలీ చేయబడుతుంది.
5. మీరు దేనికి చెల్లిస్తారు: బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, మీరు బంగారం ధర మాత్రమే కాకుండా, మేకింగ్ ఛార్జీలు, అదనపు పన్నులు కూడా చెల్లించాలి. ఆభరణాల విక్రేతలు మీ ఆభరణాల డిజైన్ ఆధారంగా 7% నుండి 25% వరకు ఎంతైనా వసూలు చేస్తారు. ఎంచుకున్న ఆభరణంలో విలువైన రాళ్లు, రత్నాలు ఉంటే, ధర పెరుగుతుంది. దాని విలువ కూడా బంగారం ధరలో చేర్చబడుతుంది. మీరు బంగారు ఆభరణాలతో వ్యవహరించేటప్పుడు, ఆ పొదగబడిన ఆభరణాల విలువను మీరు సేకరించడం లేదా పునరుద్ధరించడం అవసరం లేదు.
డిజిటల్ గోల్డ్ తో, మీరు స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే ట్రేడ్ చేస్తారు. అంటే 24 క్యారెట్ల బంగారం అన్న మాట. మీరు ఖర్చు చేసే డబ్బు బంగారంలో మాత్రమే పెట్టుబడిగా మారుతుంది. కొనుగోలు చేసే సమయంలో మీరు 3% జీఎస్టీ మాత్రమే చెల్లించాలి.
6. భద్రత: సాధారణంగా చాలా మంది డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారికి ఇది కొత్త కాన్సెప్ట్. పైగా వారికి ఈ విషయంలో అంత అవగాహన లేదు. కానీ చింతించకండి. పెట్టుబడి ఎంపికగా డిజిటల్ గోల్డ్ సురక్షితమైనదే. మీ అకౌంటులో పేరుకుపోయిన ప్రతి గ్రాము బంగారానికి నిజమైన భౌతిక బంగారం మద్దతునిస్తుంది. దీని అర్థం మీరు ఎప్పుడూ ప్రమాదంలో లేరని.
క్లుప్తంగా చెప్పాలంటే, తేడాను బాగా అర్థం చేసుకోవడంలో, మీ నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడే పట్టిక ఇక్కడ ఉంది:
ఇక్కడ మీకు డిజిటల్ గోల్డ్ విజేతలాగా అనిపించవచ్చు. కానీ, అది నిజంగా మీరు మీ పెట్టుబడి నుంచి ఏం కోరుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. డిజిటల్, ఫిజికల్ గోల్డ్ రెండూ వాటి వాటి లాభాలు, నష్టాలను కలిగి ఉంటాయి. కానీ, ఎవరో చెప్పారని కాకుండా మీరు కూడా దీని గురించి పరిశోధన చేయండి. మీ పరిస్థితికి ఏ పద్ధతి మెరుగ్గా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. దాన్నే అనుసరించండి.