మీ టీనేజర్​కు డబ్బు గురించి బోధించడం ఎలా?

April 18, 2022

డబ్బు గురించి మీ టీనేజర్​తో మాట్లాడటానికి భయపడుతున్నారా? చింతించకండి. మాకు అర్థమైంది. డబ్బు గురించి మీ టీనేజర్​కు ఎలా బోధించాలో ఇక్కడ 6 మార్గాలు ఉన్నాయి.

 

తల్లిదండ్రులుగా ఉండటం అంత సులభమేమీ కాదు. మరీ ముఖ్యంగా మీ పిల్లలు టీనేజర్లు అయినప్పుడు. మీరు ఆ కొన్ని సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయా అని చూస్తారు లేదంటే భయపడుతుంటారు.

 

మీరు ఏ వైపు ఉన్నా, ఇప్పుడు ముఖ్యమైన విషయాల్లో మీ పిల్లలకి సహాయం చేయాలని మీకు తెలుసు; ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో.

 

మీ టీనేజర్ పెరుగుతున్నారు, నిస్సందేహంగా వారు స్వేచ్ఛ కావాలని అనుకుంటారు. ఇది వారు ఇంట్లో కంటే సొంతంగా ఎక్కువ సమయం గడిపే వయస్సు.

 

‍అందువల్ల, వారు కూడా కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు.

 

డబ్బు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడంలో వారికి సహాయపడండి. ఎలా సంపాదించాలి, పొదుపు చేయాలి, డబ్బును ఎలా గౌరవించాలో నేర్పించండి. దీనికోసం మీరు చేయగల కొన్ని అంశా​లు ఇక్కడ ఉన్నాయి:

1. కోరికలు, అవసరాల మధ్య తేడా:

మీ టీనేజర్ మీతో, "నాకు ఓ కొత్త స్మార్ట్ ఫోన్, లేటెస్ట్ వీడియో గేమ్ కావాలి" అని చెప్పవచ్చు. "ఇది అవసరం అని నువ్వు ఎందుకు నమ్ముతున్నావ్?" అని వారిని అడగండి. బాగా ఆలోచించిన సమాధానంతో సిద్ధంగా ఉండండి.

ఏదైనా అవసరం అని చెప్పడానికి మీ టీనేజర్​కు సరైన కారణాలు ఉండవచ్చు, కాబట్టి దృఢంగా ఉండండి.

‍అవసరాలు, కోరికల మధ్య తేడాను వివరించేటప్పుడు వారికి కొన్ని ఉదాహరణలు చెప్పండి.

మీరు వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటే, అది మొదట సమస్యగా కనిపించకపోవచ్చు, కానీ ఒకసారి అది అలవాటుగా మారి, అవసరంగా భావించిన తరువాత, ఘర్షణలు తలెత్తవచ్చు.

కానీ మీ బిడ్డకు వారి కోరికలు ముఖ్యమైనవి కాదని చెప్పడానికి మీరు కూడా ఇష్టపడరు.

వారి కోరికల కోసం డబ్బు ఆదా చేసేందుకు సేవింగ్స్ అకౌంట్ తెరవమని వారికి సలహా ఇవ్వండి.

2. వారికి బ్యాంక్ అకౌంట్ తెరిచి ఇవ్వండి

మీ టీనేజర్​కు మొదటి బ్యాంకు అకౌంట్​ను తెరిచి ఇవ్వడం అనేది వారి జీవితంలో ఒక మలుపు. ఒక దంతాన్ని కోల్పోవడం లేదా డ్రైవింగ్ నేర్చుకోవడం లాంటి ఒక మలుపు.

వారు తమ మొదటి పుట్టినరోజు కోసం అందుకున్న పిగ్గీ బ్యాంకును అధిగమించారు. అంటే నిజమైన బ్యాంకు ఖాతా తెరవాల్సిన సమయం ఆసన్నమైంది, అంతే అంటారా?

 

వారు ఇంకా మైనర్లుగా ఉన్నందున మీరు జాయింట్ అకౌంట్​ను తెరవవచ్చు లేదా మీరు ఆ అకౌంట్ యొక్క సైనర్ కావొచ్చు, తద్వారా మీరు వారి ఖర్చు అలవాట్లను పరిశీలించవచ్చు.

వారి అకౌంట్లను ఎలా సర్దుబాటు చేయాలో, వారి ఖర్చును ఎలా ట్రాక్ చేయాలో, పొదుపు ఎలా చేయాలో వారికి అవగాహన కల్పించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

3. వారి డబ్బును మేనేజ్ చేయడం

ఒకవేళ మీరు మీ పిల్లల కోసం సేవింగ్స్ అకౌంట్​ను తెరిచినట్లయితే, ఈ వయస్సులో వారికి నియంత్రణ ఇవ్వండి.

రెగ్యులర్ సేవింగ్ అలవాట్లను అభివృద్ధి చేసుకోవడంలో వారికి సహాయపడండి. మీ పొదుపులో మీరు ఎప్పుడు లేదా ఎందుకు దానిలో మునిగిపోవాలి అనే దాని గురించి మాట్లాడండి.

పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. కాబట్టి వారు తీసుకోగల సరైన పొదుపు, పెట్టుబడి అలవాట్లను నేర్చుకున్నారని నిర్ధారించుకోండి.

వారికి ఒక ఉదాహరణగా నిలుస్తారు. మీ సొంత సేవింగ్ చిట్కాలను వారితో పంచుకోండి. మీ జేబుకు చిల్లు పడకుండా మీరు డబ్బును ఎలా ఆదా చేయగలరో అన్వేషించండి.

4. బడ్జెట్​ పెట్టుకోవడం, దాన్ని మేనేజ్ చేయడం

బడ్జెట్ ఎలా పెట్టుకోవాలో, దాన్ని ఎలా మేనేజ్​ చేయాలో మీ పిల్లలకు నేర్పించండి. బడ్జెట్ అనేది బైక్ నడపడం లాంటిది కాదని వారికి చెప్పండి (ఒక్కసారే నేర్చుకోవద్దు, దాన్ని మర్చిపోవద్దు).

పొదుపు, ఖర్చులన్నింటినీ ట్రాక్ చేయమని వారికి సూచించండి.

 

మీ బడ్జెట్​ను వారికి చూపించండి. వారి సొంత మొదటి ఐట్రేషన్​లను ఏర్పాటు చేయడంలో వారికి సహాయపడండి.

వారు ఏవిధంగానైనా వారి మొబైల్​కు అతుక్కుపోతారు కనుక, వాటిని సాధారణ బడ్జెట్ యాప్​లో ఎందుకు పొందకూడదు?

5. అప్పు ప్రభావాన్ని అర్థం చేసుకోవడం

మీ టీనేజర్​కు క్రెడిట్ కార్డును కలిగి ఉండటానికి లేదా లోన్ కోసం దరఖాస్తు చేయడానికి తగినంత వయస్సు లేదు, కానీ కొన్ని సంవత్సరాలకు వారు ఆ వయస్సులో ఉంటారు.

మీరు లోన్ డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారో మీ బిడ్డకు చూపించడానికి సమయం తీసుకోండి.

ఒకవేళ మీ బిడ్డకు 18 సంవత్సరాలు నిండి, కాలేజీకి వెళుతున్నట్లయితే, ఏదైనా లోన్ (ప్రత్యేకంగా స్టూడెంట్ లోన్) లేదా ఏదైనా క్రెడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేయడానికి ముందు ఆ లోన్​కు నిజంగా ఎంత ఖర్చు అవుతుందో వారికి తెలిసేటట్లుగా చూసుకోండి. ఆఫర్ల యొక్క నిబంధనలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడండి.

అదనంగా ఇంటర్న్​షిప్​లు, ఉద్యోగాలు, జీతం, పన్నుల గురించి వారితో మాట్లాడండి.

6. ఇవ్వడం

మీరు ఇవ్వడంలో తప్పు చేయలేరు, అంతేనా? డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం, ఖర్చు చేయడం అవసరమే అయినప్పటికీ అదృష్టం లేని వారు లేదా అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేయడం కూడా ముఖ్యం.

మీ టీనేజర్​కు నేర్పించదగిన మంచి విషయాల్లో ఒకటి ఇవ్వడాన్ని ప్రశంసించడం, అర్థం చేసుకోవడం వారికి నేర్పించడం.

వారు తమ భత్యం లేదా ఇతర సంపాదనలోని డబ్బును ఎందుకు విరాళంగా ఇవ్వాలో వారికి అర్థమయ్యేలా వివరించండి.

మీరు చిన్న వయస్సులో ఇవ్వడం యొక్క విలువను మీ పిల్లలకు బోధించినప్పుడు, అది ఎంత మంచిగా అనిపిస్తుందో వారు గుర్తుంచుకుంటారు. (ఆశాజనకంగా) వారు తమ సొంత నగదును నిర్వహించేటప్పుడు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.

ఈ కొన్ని చొరవలు మీ టీనేజర్ కళాశాల కోసం డబ్బును ఆదా చేయడానికి, అత్యవసర పరిస్థితుల కోసం ప్రణాళిక వేసుకోవడానికి, బహుశా చిన్న వయస్సు నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి సహాయపడతాయని ఆశిద్దాం.

వారు వెంటనే అర్థం చేసుకోలేేకపోతే ఆందోళన చెందవద్దు. వారి ప్రారంభ సంవత్సరాల్లోనే బలమైన ఆర్థిక పునాదిని నిర్మించినందుకు వారు ఖచ్చితంగా తరువాత మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు.

మీ పిల్లలతో డబ్బు గురించి మీరు ఎలా సంభాషణ ప్రారంభించవచ్చో చూడండి (వయస్సు 3 నుంచి 13).

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.