ఇంతవరకు ఎప్పుడూ బడ్జెట్ వేసుకోలేదా? ఈ బడ్జెట్ గైడ్ మీకు మంచి ఆరంభాన్ని ఇస్తుంది

December 29, 2022

డబ్బు గురించి అర్థం చేసుకొని మీ పర్సనల్ బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడానికి, అనుసరించడానికి ఉపయోగపడే 6 దశల గైడ్ మీకోసం.

సరే, మాకు అర్థమైంది - బడ్జెట్ వేసుకోవడం చాలా చిరాకు, విసుగు పుట్టించేది, చాలా సార్లు దాన్ని అనుసరించడం కూడా కష్టం.

అందుకే ఈ కారణాల వల్ల మీకు బడ్జెట్ వేసుకోవడం అంటే కూడా అసహ్యమై ఉండవచ్చు. కానీ మనం కొద్దిగా అసహ్యం తగ్గించుకొనే మార్గం ఉంది!

నమ్మట్లేదా? మీ పర్సనల్ బడ్జెట్ ఎలా రూపొందించుకోవాలో చెబుతూ అనుసరించడానికి ఉపయోగపడే 6 దశల గైడ్ ఇదిగో.

1. మీ చేతికొచ్చే జీతం ఎంతనేది బాగా గమనించుకోండి

 

ముందు చేయాల్సిన పనులు ముందుగా చేసేయాలి. మీరు నిజంగా నెలకు ఎంత ఖర్చు పెట్టగలరో చూసుకోండి. 

ఎందుకంటే, మీరు నెలకు ఎంత ఖర్చు పెడతారో తెలుసుకోకుండా బడ్జెట్ వేసుకోవడం అనవసరం.

ఒక ఏడాదిలో మీకు వచ్చే  జీతాన్ని 12 తో భాగించుకొని దాన్ని ఖర్చు పెట్టడం మంచి పద్ధతి కాదు.

ఎందుకంటే మీరు ఇలా ప్లాన్ వేసుకుని పర్సనల్ బడ్జెట్ జాబితా వేసుకుంటే దానిలో మీకు అకస్మాత్తుగా ఏదైనా పంటి నొప్పి వచ్చినా లేదంటే అనుకోకుండా సెలవులు వచ్చి మీ ఇంటికి విమానంలో వెళ్లాల్సి వచ్చినా అవి దానిలో కవర్ అవ్వవు కదా మరి!

 

కాబట్టి, మీరు డబ్బు ఎక్కడ, ఎప్పుడు, దేనికోసం ఖర్చుపెట్టాలనే దానికోసమే ప్లాన్ వేసుకోవడం కంటే ఖర్చు కోసం ఒక సింపుల్ ప్లాన్ వేసుకోవడం ఎప్పుడూ మంచిదే.

2. మీ కోరికల నుంచి అవసరాలను తెలుసుకోండి

జీవితం గడవడానికి చేయవలసిన ముఖ్యమైన ఖర్చులే అవసరాలు.

ఇవి ఎప్పుడూ ఉండే ఖర్చులు. మీ జీతంలో ఎక్కువ శాతం వీటికే ఖర్చు పెడతారు మీరు.  అంటే అద్దె, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ రీపేమెంట్‌లు, యుటిలిటీ బిల్లులు, ప్రయాణాలు, ఆహార ఖర్చుల లాంటివి.

మీ అవసరాలను తెలుసుకోవాలంటే మీరు ఖర్చు పెట్టే పద్ధతిని మీరు ఒకసారి గమనించాలి.

దీన్ని సరిగ్గా తెలుసుకోవడానికి ఒక తెలివైన పధ్ధతి ఉంది. గత 2 నెలల క్రెడిట్ లేదా బ్యాంకు స్టేట్​మెంట్లు చూసుకొని మీ క్యాలెండర్​లో ఏ తేదీల్లో మీరు బిల్లులు కట్టారో చూసుకుంటే చాలు.

ఇది చేయడం వల్ల మీ అకౌంట్​లో నుంచి డబ్బు ఎప్పుడు బయటకు వెళుతోందో తెలుస్తుంది.

ఈ విధంగా మీరు ఖర్చు పెట్టే విధానం తెలుస్తుంది. ఉదాహరణకు, మీరు డిన్నర్​కు ఎన్నిసార్లు ఆర్డర్ చేశారు, ప్రతిసారీ ఎంత ఖర్చు పెట్టారు ఇలాంటివన్నమాట. 

3. మీ కోరికలను అదుపులో పెట్టుకోండి

మీరు మరింత సౌకర్యవంతంగా బతకడానికి పెట్టే ఖర్చులను మీ కోరికలు అని చెప్పవచ్చు.

అంటే, అవి లేకుండా మీరు బతకగలరు కానీ, అవి ఉంటే జీవితం ఇంకా ఆనందంగా ఉంటుంది అనిపించే వస్తువులన్నమాట.

ఉదాహరణకు‍, తిండి ఒక అవసరం. కానీ వారంలో రెండుసార్లు బయట తినాలనిపించడం అనేది కోరిక.

మీ కోరికలేమిటో తెలుసుకోవాలంటే, మీ జీతంలో నుంచి అవసరాలకు అయ్యే ఖర్చును తీసేస్తే మీ కోరికల కోసం హాయిగా ఎంత ఖర్చుపెట్టగలరో తెలుస్తుంది.

అంటే, నెల జీతం - తప్పని ఖర్చులు = మీరు మీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోగలిగే డబ్బు


4. దాచుకోవడం మర్చిపోవద్దు 

మీ బడ్జెట్‌లో పొదుపును ఖర్చుగా అనుకొని వాటిని ట్రాక్ చేస్తూ ఎక్కువ ఖర్చు అవకుండా చూసుకోండి!

మీరు ఖర్చు చేస్తున్న డబ్బుకు ఎల్లప్పుడూ జవాబుదారీతనం కలిగి ఉండండి. అది తర్వాత విషయాలను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది.

ఈ అలవాటు మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ ట్రాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

బడ్జెట్ ప్లాన్ ఎందుకంత ముఖ్యమో ఎక్కువగా విడమర్చి చెప్పలేము. ఎందుకంటే మీ ఖర్చులను ట్రాక్ చేయడం అటు దీర్ఘకాలికంగానూ, ఇటు స్వల్పకాలికంగానూ మీకు సహాయపడుతుంది.

మీ జీతం వచ్చిన వెంటనే మీరు మీ ఆదాయంలో 10% ఆదా చేసుకోవడానికి వేరే బ్యాంక్ అకౌంట్​ను ఉపయోగించడం అనేది అత్యంత తెలివైన మార్గాలలో ఒకటి.

మీ ఖర్చు ట్రాక్ చేయడానికి మరొక అకౌంట్ వాడండి, అంతే! మీరు ఇన్నాళ్లుగా ఎదుర్కొన్న బడ్జెట్ సమస్యను పరిష్కరించే సులువైన పరిష్కారాన్ని మీరు కనుగొన్నట్టే. 


5. చిన్న ఖర్చులను కూడా గమనించుకోండి

మీ బడ్జెట్లో నిజాలు లేకపోతే మీరు దాన్ని అనుసరించలేరు. మీరు రూ. 100 తో స్నాక్స్ కొని ఉంటే, అది కూడా మీ ఖర్చులలో రాయండి.

ఈ  వారాంతంలో సినిమాకు వెళ్తున్నారా? టిక్కెట్లకు రూ. 250 ఖర్చు అయితే అది కూడా రాసుకోండి.

విచక్షణ లేని ఖర్చుల వల్ల మీరు ప్రతీ సంవత్సరం వేలాది రూపాయలను సులువుగా ఖర్చు చేస్తారు, అది మీకు అంతగా తెలియదు కూడా. 

మీ ఖర్చులన్నింటినీ గుర్తించడం, రాసుకోవడమే మీ రెగ్యులర్ బడ్జెట్​ను అనుసరించడానికి ఉపయోగపడే ఒక మంచి విధానం. 

అయితే, మీ బీర్​కు, బర్గర్​కు అయ్యే ఖర్చులను మాన్యువల్‌గా ట్రాక్ చేయడం, ట్యాక్సింగ్ చేయడం స్పష్టంగా చాలా తెలివితక్కువైన పని.

మీరు మీ అకౌంట్ నుండి కొంత డబ్బు వాడుకున్న ప్రతీసారి మీ ఖర్చులను మాన్యువల్‌గా ట్రాక్ చేస్తే, మీరు ఎప్పుడూ మీ వాలెట్ నుంచి ఎంత మొత్తం పోతుందో అనే దాని గురించి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది.

అయితే, మీరు ఖర్చు చేసిన ప్రతీసారి ఆదా చేయడానికి ఒక యాప్ ఉంటే? అదృష్టవశాత్తూ, మనం టెక్నాలజీలో సాధించిన ప్రగతి దానిని సాధ్యం చేసింది.

జార్ అనేది మీ రోజువారీ ఖర్చులను సరిచేయడంలో మీకు సహాయపడే ఒక బెస్ట్ యాప్ - దీంతో మీరు 100% సెక్యూర్ డిజిటల్ గోల్డ్​లో మీ సేవింగ్స్​ను పెట్టుబడిగా పెట్టవచ్చు.

ఇప్పుడు, ఇది రెండు ప్రపంచాలలో ఉత్తమమైనది కాకపోతే, మరేమిటి?

6. మీ బడ్జెట్‌ను క్రమం తప్పకుండా మెరుగుపరచండి

ఎప్పటికప్పుడు మారుతున్న జీవన విధానంలో, మీ బడ్జెట్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కాలక్రమేణా, కొన్ని సంఘటనలు మీ జీవన విధానాలను మార్చగలవు, అప్పుడు మీ బడ్జెట్ మారాలి, అప్పుడు దాన్ని అనుసరించాలి.

ఉదాహరణకు, మీరు గృహ రుణం తీసుకోవడమో లేదా పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని అనుకున్నప్పుడో, మీ బడ్జెట్​లో అటువంటి మైలురాళ్లకు చోటు కల్పించాలి.

అదేవిధంగా, కొన్ని ఖర్చులు మీ ప్రస్తుత బడ్జెట్ ప్లాన్‌లో ఉండకపోవచ్చు – కొత్త ఐఫోన్ ఈఎంఐ లేదా పాత స్టూడెంట్ లోన్. 

ఎప్పటికప్పుడు మీ బడ్జెట్ ప్లాన్ ఇప్పటికీ మీ అవసరాలకు అనుగుణంగా ఉందో లేదో అర్థం చేసుకోవడానికి మీరు దాన్ని ఎప్పుడూ గమనించుకొని మలచుకోవడం ఎంతో ముఖ్యం.

మీ ఖర్చు, ఆదాయం ఏ స్థితిలో ఉన్నాయో లెక్కించేందుకు ప్రతీతి 2-3 నెలల తర్వాత సమయానికి తగినట్టు మీ బడ్జెట్ జాబితా తనిఖీ చేయండి..

చివరికి మేము మీకు చెప్పదలచుకున్నది 

ఇప్పుడు మేము సేవింగ్స్ గురించి, బడ్జెట్‌ గురించిన జ్ఞానాన్ని మీతో పంచుకున్నాం. ఇక ఇప్పుడు మీరు ముందుకు వెళ్లి వాటిని ఒకసారి ప్రయత్నించి చూడండి.

రాను రాను, మీరు మీ బడ్జెట్‌ను మీకు నచ్చిన పద్దతిలో తయారు చేసుకుంటారు. మీకు అది చాలా సులువైపోతుంది. 

ప్రయోగాలు చేస్తూ ఉండండి. మీ డబ్బును ఆదా చేయడానికి కొత్త విధానాలను ప్రయత్నించండి.

మీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతోందో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి మీ పర్సనల్ బడ్జెట్ యాప్‌ను పొందండి.

ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ, మీ ఖర్చులకు మీరే జవాబుదారీగా ఉండండి.

అప్పుడు మీరు కేవలం ఆదా చేయడమే కాకుండా, మీ డబ్బును ఆస్వాదించడానికి స్థిరమైన వ్యవస్థను సృష్టించడం మీకు సులువు అవుతుంది!

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.