జనాదరణ పెరుగుతున్న కొద్దీ డిజిటల్ గోల్డ్ గురించి చాలా అపోహలు వ్యాపించాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తొలగించేద్దాం.
బంగారం ఎప్పటికీ వన్నె తరగని పెట్టుబడి అని అందరికీ తెలిసిందే. బంగారం అనేది మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆస్తిగా కొనసాగుతూనే ఉంది.
నేడు ఈ బంగారాన్ని భౌతిక రూపంలో (నగలు, నాణేలు లేదా కడ్డీలు) కొనుగోలు చేయడంతో పాటు పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
పెరుగుతున్న డిజిటల్ విప్లవం నేపథ్యంలో ఇది ఇటీవల కాలంలో బంగారం మార్కెట్‌కు విస్తరించింది. తాజాగా డిజిటల్ గోల్డ్ రూపంలో పరిచయం చేయబడింది. భారతదేశంలో ఇది కొత్త కాన్సెప్ట్, కాకపోతే ప్రయత్నంచేందుకు సరైనదే.
డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి?
డిజిటల్ గోల్డ్ అంటే ఆన్‌లైన్ చానెళ్ల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే కొత్త రకం పద్ధతి అని చెప్పుకోవచ్చు. బంగారం కొనాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు.
మీరు కొనుగోలు చేసే ప్రతి గ్రాము బంగారాన్ని మీ పేరు మీద 24 క్యారెట్ల రూపంలో భారత దేశంలోని మూడు గోల్డ్ బ్యాంకుల్లో ఒక దానిలోని లాకర్లో నిల్వ చేసి ఉంచుతారు. ఆ బ్యాంకులు.. ఆగ్మోంట్ (Augmont) | MMTC - PAMP | సేఫ్గోల్డ్ (SafeGold).
కేవలం యాప్‌లోని బటన్‌ను క్లిక్ చేసి ఇన్వెస్టర్లు సులభంగా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయొచ్చు.. విక్రయించొచ్చు లేదా భౌతిక రూపంలో బంగారం ఇంటికే డెలివరీ అయ్యేలా చేసుకోవచ్చు. అలాగే.. డిజిటల్ బంగారం కొనడానికి కనీస పరిమితి అంటూ లేదు. మీరు ఒక్క రూపాయి నుంచి కొనుగోలు ప్రారంభించవచ్చు. చాలా బాగుంది కదా?
కానీ దీనికి పెరుగుతున్న ప్రజాదరణతో పాటు ఇన్వెస్టర్లలో అపోహలు, తప్పుడు సమాచారం కూడా పెరుగుతూ ఉన్నది. ఫలితంగా వారు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ఎంతో విలువైన పెట్టుబడి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
కాబట్టి డిజిటల్ గోల్డ్ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని సాధారణ అపోహలను తొలగించుకుందాం:
అపోహ 1: బంగారం ఖరీదైనది, ధనవంతులు మాత్రమే దాన్ని కొనుగోలు చేయగలరు.
అలా అస్సలు కాదు! డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడంలో ఉత్తమమైన అంశం ఏంటంటే.. మీరు జార్ యాప్ ద్వారా కేవలం ఒక్క రూపాయితో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
అవును ఇది నిజం! బంగారాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు, ఇది మీ బడ్జెట్‌కు అనుకూలమైనది కూడా. ఇంతకుముందు కొనుగోలు చేసే వీలు లేని ఈ లోహం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. మేము దీన్ని ఇష్టపడుతున్నాం.
అపోహ 2: బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం.
ప్రతి పెట్టుబడి కొంత రిస్క్‌తో కూడుకున్నదే. వాటిలో లాభనష్టాలు కూడా ఉంటాయి. బంగారం కూడా అంతే.
నిజానికి స్టాక్‌లు, ఈక్విటీల వంటి వేరే అత్యంత అస్థిర పెట్టుబడుల కన్నా బంగారంలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. బంగారం అనేది స్థిరమైన డిమాండ్‌తో కూడిన ఆకర్షణీయమైన పెట్టుబడి.
ఇది ద్రవ్యోల్బణం, రిస్క్ పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుంది.
అపోహ 3: డిజిటల్ బంగారం నిజమైన బంగారం కాదు.
మీ బంగారం బ్యాలెన్స్ 0.5 గ్రాములకు చేరుకున్నప్పుడు మీరు నాణేలు లేదా ఆభరణాల వంటి భౌతిక రూపంలోని బంగారంగా మార్చుకోవచ్చు.
విత్‌డ్రా చేసుకోవడానికి లేదా మీ పొదుపులను భౌతిక రూపంలోని బంగారంగా మార్చుకోవడానికి మొహమాటం పడకండి. జార్ యాప్ ద్వారా ఎప్పుడైనా సరే మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడుతుంది.
అపోహ 4: బంగారం ఒక చెత్త పెట్టుబడి.
వాస్తవానికి ఇది వ్యతిరేకం. సరిగ్గా ఆలోచించి చేసిన బంగారం పెట్టుబడులు చక్కటి రాబడులను అందిస్తాయి.
నిజమే.. పడిపోతున్న స్టాక్ ధరలకు వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయ పెట్టుబడిగా బంగారాన్ని హెడ్జ్ లాగా ఉపయోగించుకోవచ్చు.
ఇది ఆర్థిక మాంద్యం, ఆదాయ నష్టాల నుంచి కాపాడుతుంది. గత 92 ఏళ్లుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయనేది గమనార్హం.
భారతదేశంలో బంగారానికి సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉండటమే కాకుండా అంతర్గత విలువను కూడా కలిగి ఉంది. అలాగే ఏటికేటికీ మరింత మెరుగైన రాబడి వస్తుంటుంది.
బంగారం లాగా పునర్విక్రయ విలువ లేని వజ్రాలు లేదా ప్లాటినంతో పోలిస్తే బంగారం ఎప్పటికీ చాలా మంచి పెట్టుబడి ప్రత్యామ్నాయమే.
అపోహ 5: బంగారాన్ని కొనుగోలు చేయడం కష్టం, దానికి విస్తృతమైన డాక్యుమెంటేషన్ అవసరం.
లేదు, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చాలా సులభం, అనుకూలమైనది. మీకు కావలసిందల్లా ఒక స్మార్ట్ ఫోన్, జార్ యాప్, ఇంటర్నెట్ యాక్సెస్, బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ అకౌంట్.
అంతే! ఏ సమయంలోనైనా బంగారం మీ ముంగిట్లోకి వస్తుంది. జార్ యాప్‌లో కేవైసీ లేకుండా 30 గ్రాముల వరకు డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు.
మీ లావాదేవీ రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మీరు తప్పనిసరిగా మీ పాన్ కార్డ్ వివరాలు అందించాల్సి ఉంటుంది.
అపోహ 6: తెలియని ఖర్చులు, ఖరీదైన స్టోరేజీ ఫీజులు ఉంటాయి.
జార్ పారదర్శకతను నమ్ముతుంది. మీరు జార్ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై మాత్రమే ట్రేడ్ చేస్తారు. మీరు ఖర్చు చేసే మొత్తం బంగారంలో మాత్రమే పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.
కొనుగోలు చేసే సమయంలో మీరు 3% జీఎస్టీ మాత్రమే చెల్లించాలి. తెలియని ఖర్చులు లేదా స్టోరేజీ ఫీజులు అంటూ ఏవీ ఉండవు.
డిజిటల్ గోల్డ్ ఉచితంగా అదిక భద్రత కలిగిన వాల్ట్‌లలో నిల్వ చేయబడుతుంది. పైగా ఆ బంగారానికి పూర్తిగా బీమా కూడా ఉంటుంది.
అపోహ 7: ఆన్‌లైన్ బంగారం స్వచ్ఛమైన బంగారం కాదు.
జార్‌లో, డిజిటల్ గోల్డ్ 99.5 శాతం 24 క్యారెట్ల స్వచ్ఛతతో ఉంటుంది. మీరు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆగ్మోంట్ గోల్డ్ లిమిటెడ్ (Augmont Gold Ltd), Digital Gold India Pvt. Ltd. - SafeGold, మరియు MMTC-PAMP India Pvt. Ltd. వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఆ బంగారాన్ని యాక్సెస్ చేయడంలో నిజానికి మీకు సహాయపడే మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఇది నిజమైనది.. సురక్షితమైనది, ఎంతో స్వచ్ఛమైనది.
ఆసక్తిగా ఉంది కదూ? డిజిటల్ గోల్డ్ మరియు భౌతిక బంగారం కంటే డిజిటల్ గోల్డ్ ఎలా ఉత్తమం అనే దాని గురించి మరింత చదవండి.
ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా? తరచూ అడిగే ప్రశ్నలు, జార్‌ను సందర్శించండి.
ఇప్పుడు మేము వాస్తవాలను తెలియపరిచాం. డిజిటల్ గోల్డ్ ఎంత మంచి పెట్టుబడో చూడండి? అస్సలు మిస్ అవ్వకండి.
నిజానికి, ఓ డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ కంటే జార్ అనేది చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇది మీపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా మీ డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయపడే ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాం.
జార్ యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం వెంటనే ప్రారంభించండి!