మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆర్థిక అక్షరాస్యతను నేర్పించండి. వారికి ఆర్థిక అక్షరాస్యతను ఎలా నేర్పించవచ్చో అన్వేషించండి.
మనమంతా చిన్నప్పుడు “చెట్లకు డబ్బులు కాయవు” అనే పదాన్ని ఎక్కువగా వినే ఉంటాం. తల్లిదండ్రులతో పాటుగా ఉపాధ్యాయులు కూడా ఇదే విషయాన్ని మనకు నేర్పించారు. కానీ దురదృష్టవశాత్తు ఆర్థిక అక్షరాస్యత మీద మన పరిజ్ఞానం అంతటితోనే ఆగిపోయింది.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అనేక విషయాలను నేర్పించడంతో పాటు మరెన్నో విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు. ఉదా.. బైక్ నడపడం, వంట చేయడం, కారు నడపడం మొదలగునవి. కానీ ముఖ్యమైన విషయాన్ని మాత్రమే వారికి నేర్పించడం మర్చిపోతున్నారు. అదే మనీ మేనేజ్మెంట్.
డబ్బు విషయంలో అజ్ఞానం ఆనందం కానే కాదు. అలాగే మీకు తెలియని విషయాలు మిమ్మల్ని అతిగా బాధపెట్టవచ్చు.
మనం ఎప్పుడూ పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన విజ్ఞానాన్ని పొందలేదు. అందుకేనేమో పిల్లలకు చిన్నప్పుడే ఆర్థిక అక్షరాస్యత నేర్పించడం ఎంత ముఖ్యమో మనం గ్రహించలేకపోయాం.
కానీ, వారు మనలాగా పెరగాలని మనం కోరుకోం కదా? చిన్నప్పటి నుంచే మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడం వలన పిల్లలు అనేక రకాల ప్రయోజనాలను పొందుతారని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
ఇది వారి సమగ్రాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
కేంబ్రిడ్జి పరిశోధకులు చేసిన ఓ పరిశోధన ప్రకారం మీ పిల్లలకు ఆర్థిక అలవాట్లు ఏడేళ్ల వయసులో అలవడుతాయి. దేని ప్రకారం చూసుకున్న ఏడు సంవత్సరాల వయసు చిన్న వయసే.
ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేయడం ఎలాగో నేర్చుకోవడం నేటి ప్రపంచంలో చాలా అవసరం. అలాగే ఆర్థిక అక్షరాస్యత కూడా చాలా అవసరం.
మరి మీరు మీ పిల్లలకు చిన్న వయసు నుంచే ఆర్థిక అక్షరాస్యతను ఎలా నేర్పించాలి?
పిల్లలకు ఆర్థిక అక్షరాస్యతను బహుమతిగా ఇవ్వడం కోసం ఉపయోగించే కొన్ని చిట్కాలు మా వద్ద ఉన్నాయి.
1. వారికి అలవెన్సెస్ ఇవ్వండి
మీ పిల్లలకు పాకెట్ మనీని ఇవ్వడం ద్వారా వారికి డబ్బును ఎలా మేనేజ్ చేయాలో మొదటి అనుభవం వస్తుంది.
వారు తెలివిగా డబ్బులు ఖర్చు చేస్తూ పొదుపు చేయడం వలన కలిగే ప్రయోజనాలను, దుబారాగా ఖర్చు చేయడం వలన కలిగే నష్టాలను త్వరగా నేర్చుకుంటారు. వారు డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోకపోతే భవిష్యత్‌లో కలిగే నష్టాల కంటే చిన్న వయసులో కలిగే నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి.
పిల్లలు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేసే వస్తువులకు కూడా విలువ ఇస్తారు.
ఎంత మొత్తాన్ని పాకెట్ మనీగా ఇవ్వాలో మీకు తెలియకపోతే.. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇందులో ఎటువంటి వేగవంతమైన నియమాలు ఉండవు. కానీ ఆ డబ్బును సంపాదించడానికి ప్రయత్నించండి.
ఈ విధంగా చేయడం వలన డబ్బు ఎలా పని చేస్తుందో వారు బాగా తెలుసుకుంటారు.
ఇంటిని శుభ్రపర్చడం, వారి బొమ్మలను శుభ్రం చేసుకోవడం, లాండ్రీ బట్టలను మడత పెట్టడం, వారి కంటే చిన్న పిల్లలను ఆడించడం వంటి పనులను ఆధారంగా చేసుకుని వారికి పాకెట్ మనీని అందజేయండి.
మీరు ఎంత మొత్తాన్ని ఎంచుకున్నా కూడా అది ఇంటి బడ్జెట్లో పునరావృతమయ్యే ఆంశంగా మారుతుందని గుర్తుంచుకోండి. ఇది మీకు, మీ పిల్లవాడికి విజయాన్ని అందిస్తుంది.
2. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వారికి తెలపండి
డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీ పిల్లలకు నేర్పండి.
మరేదైనా ఇతర స్థలం నుంచి డబ్బులు వస్తున్నాయని పిల్లలు అనుకోవడం కంటే ముందే.. పని చేస్తేనే ఆ డబ్బులు వస్తున్నాయని వారు తెలుసుకోవాలి.
డబ్బులు కేవలం అమ్మానాన్నల నేషనల్ బ్యాంకు అకౌంట్ల నుంచి రావనే విషయాన్ని వారికి తెలియజెప్పండి.
వారు ఏదైనా కొనాలని అనుకున్నపుడు మీరు వారికి పాకెట్ మనీ ఇచ్చినందున వారు అది నమ్ముతారు.
వారికి ఈ విషయాన్ని నేర్పించండి. మీరు పని చేస్తేనే మీకు జీతం వస్తుంది. లేకపోతే జీతం రాదని వారికి వివరించండి.
డబ్బు గురించి తెలుసుకోవడానికి దీనిని వారి మొదటి పాఠంగా ఉండనివ్వండి.
3. డబ్బును ఆదా చేయడం, ఖర్చు చేయడం, ఇవ్వడం గురించిన సూత్రాలను నేర్పండి
డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వారికి అర్థం చేయించిన తర్వాత డబ్బులను ఎలా ఇవ్వాలో, ఖర్చు చేయాలో, ఆదా చేయాలో వారికి నేర్పండి.
పై మూడింటిలో ఇవ్వడం అనేది చాలా విలువైనది. చిన్న వయసులోనే పిల్లలకు సహాయం చేయడం గురించి నేర్పితే వారికి సహాయం చేసే అలవాటు అలవడుతుంది.
పొదుపు, ఖర్చుల విషయానికి వస్తే మీరు వారికిచ్చే డబ్బులో కొంత డబ్బును పొదుపు చేయమని, కొంత డబ్బును ఖర్చు చేయమని వారికి నేర్పించండి.
ఒకసారి ఖర్చు చేసిన తర్వాత డబ్బు తిరిగి రాదని వారికి తెలియజేయండి.
అవును, మీ పిల్లలు అప్పుడప్పుడూ తప్పులు చేస్తారు. కానీ ఇంటి వద్ద ఉన్నప్పుడు తప్పులు చేస్తే దాని నుంచి వారు ఏదో ఒకటి నేర్చుకుంటారు.
4. డబ్బులను మేనేజ్ చేసుకోవడం కోసం వారికి మూడు పిగ్గీ బ్యాంకులను ఇవ్వండి
మీ పిల్లలకు మూడు పిగ్గీ బ్యాంకులను అందించండి. ఒక దానికి ఖర్చు, ఒక దానికి పొదుపు, మరోదానికి ‘గివ్’ అని పేర్లు పెట్టండి.
మీరు మీ పిల్లలకు ఎప్పుడైనా సరే డబ్బులను ఇచ్చినప్పుడు లేదా వారికి జన్మదినం సమయంలో లేదా ఎప్పుడైనా రివార్డుగా డబ్బును ఇచ్చినప్పుడు వాటిని మూడు పిగ్గీ బ్యాంకుల్లో సమానంగా వేయమని చెప్పండి.
మీరు వారికి డబ్బులు ఇచ్చిన ప్రతీసారి వారు దానిని ఎలా ఖర్చు చేయాలని అనుకుంటున్నారో వారితో మాట్లాడండి.
మీ పిల్లల కోరికల చిట్టా పక్కన వారి పిగ్గీ బ్యాంకును ఉంచండి. తద్వారా వారు వారి ఖర్చు, పొదుపు లక్ష్యాలను గురించి తెలుసుకుంటారు.
వారు డబ్బును ఎలా విభజించారు, దాంతో ఎలా ఖర్చు చేద్దాం అని అనుకుంటున్నారో పిల్లలకే నిర్ణయాధికారం వదిలేయడం అనేది వారు ఆర్థిక అక్షరాస్యతలో మెరుగవడానికి తోడ్పడుతుంది.
ఇలా చేయడం వలన పిల్లలు ఆర్థిక విషయాల్లో నమ్మకం పొందడమే కాకుండా, పిల్లలతో తల్లిదండ్రులు మనీ మేనేజ్మెంట్ గురించి ముఖ్యమైన విషయాలను పంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
5. షాపింగ్ చేసేటప్పుడు నేర్పించండి
మీ పిల్లలను షాపింగ్‌కు తీసుకెళ్లి వారితో మీ నిర్ణయాలను గురించి చర్చించండి.
మీరు దుకాణానికి వెళ్లినప్పుడు ఎంత డబ్బు ఖర్చు చేస్తారు, మీ ప్రాధాన్యతలను గురించి మీ పిల్లలకు నేర్పించండి.
డిస్కౌంట్లు, కూపన్లు ఎలా పని చేస్తాయో పిల్లలకు వివరించండి. మీరు షాపింగ్ చేసేటప్పుడు అనుసరించే విధానాలనే మీ పిల్లలు కూడా అనుసరిస్తారు.
మీ పిల్లలకు వారి ఖర్చుల కోసం చాలా తక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వండి. చిన్నపిల్లలు రూ. 20 ఖర్చు చేస్తే ఎలా స్పందిస్తారో మీరు కనుక చూస్తే నిజంగా షాక్ అవుతారు.
వారు బడ్జెట్‌కు లోబడి మాత్రమే ఖర్చు పెట్టే పద్ధతిని నేర్చుకుంటారు.
6. డబ్బుతో సంబంధముండే గేమ్స్ ఆడండి
ఇది మీ పిల్లలకు తెలియకుండానే వారికి ఒక పాఠం బోధించడంలో చాలా ప్రభావవంతమైన విధానం.
ఆర్థిక అంశాలతో ముడిపడ్డ మోనోపోలి వంటి గేమ్స్‌ను మీ పిల్లలతో కలిసి ఆడండి. ఈ గేమ్ ఆడేటప్పుడు మీ పిల్లలకు సహాయం చేయండి.
మీరు వారితో ఆడుకుంటున్నట్లు అనిపించినా కానీ ఇది మీ పిల్లలకు ఆర్థిక అవసరాలను నేర్పడంతో పాటు బడ్జెట్ ప్లానింగ్ ఆవశ్యకతను గురించి తెలుపుతుంది.
తప్పులు చేయడం వలన ఎటువంటి ప్రభావాలు కలుగుతాయనేది పిల్లలకు ఆటల వలన తెలుస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి రివార్డులు వస్తాయనే విషయం కూడా తెలిసి వస్తుంది.
మీ పిల్లలను ఎటువంటి బెదిరింపులకు గురి చేయకుండా కూడా వారిలో మార్పులను తీసుకురావచ్చు.
7. ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యమైన కొనుగోళ్లలో వారిని భాగం చేయండి
ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా ఏదైనా కొత్త పరికరాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? కొనుగోలు ప్రక్రియతో పాటు దానికి సంబంధించిన శోధన ప్రక్రియలో మీ పిల్లలను కూడా భాగస్వాములను చేయండి.
మీరు నిర్ణయం తీసుకోవడానికి సంబంధించిన అంశాలను మీ పిల్లలకు చూపించండి. మీరు కొనుగోలు చేసే ముందు ఆప్షన్లను అంచనా వేయడంలో సహాయం చేయమని వారిని అడగండి.
మమ్మల్ని నమ్మండి. మొత్తం కుటుంబం కోసం నిర్ణయం తీసుకున్నందుకు మీ పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు.
డబ్బును గురించిన ఈ చర్చలు అనధికారికంగా ఉంటాయి. డిన్నర్ టేబుల్ వద్ద కూడా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంటుంది.
కుటుంబం మొత్తం కలిసి డబ్బు గురించి ఆలోచించడం చాలా బాగుంటుంది. దానికి సంబంధించిన చర్చలో మీ పిల్లలు పూర్తిగా పాల్గొనడానికి ఇది సరైన సందర్భం. వారు ఎటువంటి ఇబ్బందికి గురికాకుండా చూసుకోవడం చాలా అవసరం.
8. బడ్జెట్ ఎలా మెయింటేన్ చేయాలో వారికి నేర్పించండి
ఖర్చును ట్రాక్ చేయడం యొక్క ప్రాముఖ్యతను వారికి నొక్కి చెప్పండి.
మీ పిల్లలు డబ్బులను ఎలా ఖర్చు చేస్తున్నారో దానిని వారానికోసారి ఎలా రికార్డ్ చేయాలో నేర్పండి. నెలాఖరులో వారి ఖర్చుల వివరాలను పట్టిక రూపంలో వారికి చూపించండి. ఇలా చేస్తే మీ పిల్లలు తప్పకుండా ఖర్చులను తగ్గించుకుంటారు.
వయస్సు ఏదైప్పటికీ మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన అంశం.
పిల్లలు తమ డబ్బులను ఎలా ఖర్చు చేస్తారో, వారు తమ అలవాట్లను మార్చుకుంటే ఎంత తొందరగా ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారో వారికి వివరించండి. వారిని ఎక్కువ పొదుపు చేయమని ప్రోత్సహించండి.
9. వారితో కలిసి ఒక విష్ లిస్ట్ తయారు చేయండి
ప్రాధాన్యతల జాబితాలను రూపొందించడం, లక్ష్యాలను నిర్ధేశించుకోవడం ఆర్థిక అక్ష్యరాస్యతలో ప్రధానాంశం.
మనకు కావాల్సిన అన్నింటినీ ఒకేసారి పొందలేము. కానీ మనం ప్లాన్ చేసుకుంటే కాలక్రమేణా ఒకదాని తర్వాత మరొకటి పొందొచ్చు.
పిల్లలు నేర్చుకోవడానికి ఇది అద్భుతమైన పాఠం కాదా? మీ పిల్లలతో కూర్చొని వారిని ఐదు వస్తువులతో కూడిన ఒక విష్ లిస్ట్ (కోరికల చిట్టా) తయారు చేయమనండి.
వారు తయారు చేసిన లిస్టులోని కోరికలను వాటి ప్రాముఖ్యత రీత్యా అతి ముఖ్యమైన వాటి నుంచి దిగువకు (అవరోహణ క్రమంలో) తయారు చేయమనండి.
మీరు చెప్పిన విధంగా జాబితాను రూపొందించిన తర్వాత వారు వారి కోరికలను ఎలా పొందవచ్చో వారితో మాట్లాడండి.
డబ్బు వ్యవహారాల గురించి మీ పిల్లలకు నేర్పించడం కనిపించేంత కష్టమైన పనేమీ కాదు. మీకు కావాల్సిందల్లా కేవలం ఓపిక మాత్రమే. ముందు చూపు కూడా ముఖ్యం.
మీ పిల్లలతో మీరు తరచూ డబ్బుల గురించి చర్చించండి. ఇలా చేయడం వలన వారు డబ్బుల గురించి అనేక ప్రశ్నలు అడుగుతారు. ఇలా చేయడం వలన వారికి జీవితాంతం ఉపయోగపడే నైపుణ్యాలెన్నో అలవడుతాయి.
మీరు మీ పిల్లలను అనేక ఆర్థిక సంబంధమైన క్విజ్‌లలో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు. వారిని ఆర్థిక విషయాలకు సంబంధించిన టోర్నమెంట్లలో కూడా పాల్గొనేలా చేయండి. ఇలా చేయడం వలన వారి ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడుతుంది. ఆర్థిక అక్షరాస్యత అనేది వారికి ఎప్పుడూ బోర్ కొట్టదు.
మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను మేనేజ్ చేయడంతో పాటు మీ మానెటరీ వ్యవహారాలను మెరుగు పరుచుకునేందుకు స్మార్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టిప్స్‌తో కూడిన ఒక గైడ్‌ను కూడా మేము మీకు అందించాం.